Telangana BJP : త్వరలో బీజేపీ రెండో జాబితా.. ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులు వీరే?

బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు.

Telangana BJP : త్వరలో బీజేపీ రెండో జాబితా.. ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులు వీరే?

Kishan Reddy

Kishan Reddy : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరానికి బీజేపీ అధిష్టానం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను.. సగానికిపైగా నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగువేయాలన్న పట్టుదలతో పార్టీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా.. నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కేంద్ర పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల జాబితాను వారికి అందజేశారు.

Also Read : BRS : వారసుల వెనకడుగు..! బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా మారిన సీన్, కారణం అదేనా?

జలగం వెంకట్రావు, సీతారాం నాయక్, నగేష్ వంటి నేతలను బీజేపీలో చేర్చుకొని ఎంపీ ఎన్నికల బరిలో నిలపాలని అధిష్టానం భావిస్తోంది. కేంద్ర పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, వారు బీజేపీలో చేరితే.. జలగం వెంకట్రావును ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, సీతారాం నాయక్ ను మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, నగేష్ ను అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బరిలో దింపాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది.

Also Read : Indira Kranthi Scheme : మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 12 నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం

మిగిలిన నియోజకవర్గాల్లో.. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం సీటుకోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరిపేరును అధిష్టానం రెండో జాబితాలో ప్రకటించనుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కృష్ణ ప్రసాద్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మనోహర్ రెడ్డికి రెండో జాబితాలో టికెట్ దక్కే అవకాశం ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ కోసం ఎస్ కుమార్, మిట్టపల్లి సురేంద్ర పోటీ పడుతున్నారు. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం రఘునందన్ రావు, అంజిరెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరి పేరును రెండో జాబితాలో అధిష్టానం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.