Manikrao Thakare : ఎమ్మెల్యేలను ఎలాంటి క్యాంపునకు తరలించం : మాణిక్ రావు ఠాక్రే

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతల పైన నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులపై తమ నాయకత్వానికి నమ్మకం ఉందని తెలిపారు.

Manikrao Thakare : ఎమ్మెల్యేలను ఎలాంటి క్యాంపునకు తరలించం : మాణిక్ రావు ఠాక్రే

Manikrao Thakare

Congress Leader Manikrao Thakare : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి బోస్ రాజు పేర్కొన్నారు. ఇప్పటికే మేజిక్ ఫిగర్ దాటామని, స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ కే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 70కి పైగా స్థానాలతో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉంటుందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి బోస్ రాజు ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. ఎమ్మెల్యేలను ఎలాంటి క్యాంపునకు తరలించబోమని చెప్పారు.

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతల పైన నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులపై తమ నాయకత్వానికి నమ్మకం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ దరిదాపుల్లో ఉండదు కూడా కాబట్టి ఎమ్మెల్యేలను తీసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తమ నేత డీకే శివకుమార్ కు ఏదో అనుమానం ఉండి మాట్లాడి ఉండవచ్చన్నారు.

Telangana Assembly Election 2023 Result : సీఎం రేసులో ఉన్నా .. 78 సీట్లు పైనే గెలుస్తాం : భట్టి విక్రమార్క

డీకే శివకుమార్ హైదరాబాద్ కు ఇన్చార్జ్ గా వచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఎక్కడైనా ఇదే సాంప్రదాయం ఉంటుందన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రానికి ఇన్చార్జీలుగా వేరే వారిని వేస్తారని పేర్కొన్నారు. సీఎం ఎవరనేది పార్టీ అధిష్టాన నిర్ణయిస్తుందన్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నేత సీఎల్పీ లీడర్ అవుతారని తెలిపారు.