Congress Protest : కాంగ్రెస్ నిరసనలో అపశృతి.. మాజీ డిప్యూటీ సీఎం రాజనర్సింహకు గాయాలు

చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యక్తంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మెదక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీత రెడ్డి హాజరయ్యారు

Congress Protest : కాంగ్రెస్ నిరసనలో అపశృతి.. మాజీ డిప్యూటీ సీఎం రాజనర్సింహకు గాయాలు

Congress Protest (2)

Updated On : July 12, 2021 / 5:13 PM IST

Congress Protest : చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యక్తంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మెదక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీత రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎద్దుల బండిని తీసుకొచ్చారు కార్యకర్తలు.. ఈ నేపథ్యంలోనే దామోదర రాజనర్సింహాతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ఎద్దులబండి ఎక్కారు. ఎద్దుల బండిపై రాజనరసింహ తన ప్రసంగం ప్రారంభించారు. మైక్ సౌండు, కార్యకర్తల అరుపులకు బెదిరిన ఎద్దులు ఒక్కసారిగా కదిలాయి.

దీంతో ఎద్దులబండి కుదుపులకు గురై బండి మీదనుంచి కిందపడిపోయారు రాజనరసింహ. ఈ ప్రమాదంలో ఆయన మోకాలికి గాయమైంది. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పక్కకు లాగారు. ఈ ప్రమాదంతో నిరసన కార్యక్రమ అర్దాంతరంగా ముగిసింది.