V.Hanumantarao : నిజమైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు : వీ.హెచ్
నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది నేషనల్ పార్టీ.. రీజనల్ పార్టీ కాదు అని అన్నారు.

Vh
V.Hanumantarao criticized Revanth : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విమర్శలు చేశారు. ఎన్ని సార్లు చెప్పినా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని వీ.హనుమంతరావు అన్నారు. బీహార్ అధికారుల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం (మార్చి 4,2022)న 10టీవీతో వీ.హనుమంతరావు ప్రత్యేకంగా మాట్లాడారు. బీహార్ ఐఏఎస్, ఐపీఎస్ అంటున్నారని.. వాళ్లంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన అధికారులేనని పేర్కొన్నారు.
20 లక్షల మంది బిహారీలు ఇక్కడ అనేక పనులల్లో ఉన్నారని వెల్లడించారు. తెలుగు వాళ్ళు కూడా బీహార్ లో పనిచేస్తున్నారని తెలిపారు. ఇలా మాట్లాడటం కాంగ్రెస్ కల్చర్ కాదన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. టీకాంగ్రెస్ కాస్త టీడీపీ కాంగ్రెస్ లా చేస్తున్నారని మండిపడ్డారు.
V Hanumantha Rao: తప్పుడు ప్రచారంపై వీహెచ్ ఫిర్యాదు.. ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై ప్రశంసలు
నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది నేషనల్ పార్టీ.. రీజనల్ పార్టీ కాదు అని అన్నారు. ఆయన నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి సోనియా గాంధీ పీసీసీ ఇస్తే .. సరే అని కలిసి పని చేద్దాం అనుకుంటున్నాం అని అన్నారు. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదని తెలిపారు.