ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు? సైదులు “కాంగ్రెస్ సర్వే”లో ఏం తేలింది?

రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందా? పెరుగుతూ వస్తోందా?

ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు? సైదులు “కాంగ్రెస్ సర్వే”లో ఏం తేలింది?

Updated On : September 20, 2025 / 9:29 PM IST

Congress Survey: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు. సీఎం రేవంత్‌ రెడ్డి పాలనపై, మంత్రుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు?

రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందా? పెరుగుతూ వస్తోందా? వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ కోసం పేరిట సెఫాలజిస్ట్ సైదులు సర్వే చేశారు. ఈ వివరాలను 10టీవీకి తెలిపారు. (Congress Survey)

Also Read: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపెవరిది? సెఫాలజిస్ట్ సైదులు చేసిన కాంగ్రెస్‌ సర్వేలో ఏం తేలింది?

“బీఆర్ఎస్‌ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో జాయిన్‌ అయ్యాక సర్వే చేశాను. వారికి చాలా గడ్డు పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే 1 లేదా 2 సీట్లే కాంగ్రెస్‌కి వస్తాయి. అది కూడా 50-50 ఛాన్సులు ఉన్నాయి.

అభ్యర్థిని చూసే ఆ 1-2 సీట్లు దక్కుతాయి. గద్వాల్‌లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీద రెండు సార్లు సర్వే చేశాను. ఒకసారి గెలుస్తారని, ఒకసారి ఓడిపోతారని వచ్చింది.

జగిత్యాలలో సంజయ్‌ ఉన్నారు. ఆయన గెలిస్తే గెలవవచ్చు. ఉప ఎన్నికలు వస్తే దానం నాగేందర్, కడియం శ్రీహరి గెలిచే ఛాన్స్‌లు లేవు” అని చెప్పారు.

పూర్తి విశ్లేషణ