Corona Effect : మందులు అవుట్ ఆఫ్ స్టాక్!

కరోనా వైరస్ భూతానికి పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది ఈ మహమ్మారి. ఈ వైరస్ నుంచి తప్పించుకోవడానికి పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి పలు దేశాలు. అందులో భారతదేశం కూడా ఒకటి. దీంతో చాలా మందిపై పెను ప్రభావం చూపెడుతోంది. జనజీవనం స్తంభించిపోతోంది.
ఏదో ఆపద ముంచుకొస్తుందోమోనని..ప్రజలు భావించి..నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని పలు వస్తువులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. అందులో మందులు కూడా ఉన్నాయి. నిల్వ ఉంచుకొనేందుకు రోగులు ఎక్కువ మొత్తంలో మందులు కొనుగోలు చేస్తుండడంతో పలు దుకాణాల్లో వాటి నిల్వలు తగ్గిపోతున్నాయి. రక్తపోటు, చక్కెర వ్యాధులకు సంబంధించి.. మందులతో పాటు..ఇన్సులిన్ ఇంజెక్షన్లు ప్రస్తుత తరుణంలో అందుబాటు లేవని పలు మెడిసిన్స్ దుకాణ యజమానులు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. తయారీదారుల నుంచే సరఫరా నిలిచిపోయిందంటున్నారు. మందులు తయరు చేసే కంపెనీలు డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి చేయడం లేదని అంతేగాకుండా.. రవాణాకు కార్మికులు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
కర్నాటక, ఢిల్లీ, హైదరాబాద్, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పలు సంస్థలు కార్మికుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల టోకు, చిల్లర మెడిసిన్స్ దుకాణాలు ఉంటే..చాలా ప్రాంతాల్లో కొరత ప్రారంభమైందంటున్నారు. అసలు లాక్ డౌన్ విషయంలో అత్యవసర సేవల కిందకు మందుల దుకాణాలు కూడా చేర్చారు. ఇవి బంద్ కావని వెల్లడించారు.
ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, మందుల షాపులు అందుబాటులో లేని వారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సుమారు మూడు నెలలకు సరిపడా..మందులు కొనుక్కొంటున్నారని తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొదట్లో కొన్ని సంస్థల్లో ఉత్పత్తి నిలిచిందని, ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే కొంత మేరకు ప్రారంభమైందని కొంతమంది వ్యాపారులు వెల్లడిస్తున్నారు. తయారీదారుల నుంచి మందుల సకాలంలో అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read | రెండు ప్రపంచ యుద్ధాల్లో పోరాడి.. చివరికి కరోనా దెబ్బకు..