పోలింగ్ సిబ్బందికి కరోనా భయం..ట్రైనింగ్ కు డుమ్మా

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 06:46 AM IST
పోలింగ్ సిబ్బందికి కరోనా భయం..ట్రైనింగ్ కు డుమ్మా

Updated On : November 25, 2020 / 10:20 AM IST

Corona fear for ghmc election polling staff : బల్దియా ఎన్నికల పోలింగ్‌కు అధికారులు భయపడుతున్నారా? కరోనా కేసులు ఇంకా నమోదవుతుండడంతో…. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు జంకుతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల కోసం ఇచ్చే శిక్షణకు హాజరుకావాలంటూ జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఉత్తర్వులను ఎవరూ పట్టించుకోవడం లేదు. ట్రైనింగ్‌కు డుమ్మా కొడుతున్నారు. ఎన్నికల సిబ్బందిని ఆందోళను గురిచేస్తున్నాయి. కరోనా కేసులు నమోదవ్వడమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఇంకా నమోదవుతుండడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ఇతర జిల్లాల నుంచి వచ్చే సిబ్బంది జంకుతున్నారు.



45 వేల సిబ్బంది : 
బల్దియా ఎన్నికల కోసం 45వేల మంది సిబ్బంది అవసరమని ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందుకోసం వివిధ జిల్లాల్లోని అధికారులను ఎంపిక కూడా చేసింది. ఈ మేరకు వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ట్రైనింగ్‌కు హాజరు కావాలంటూ ఎన్నికల కమిషన్ నుండి ఉత్తర్వులు వెళ్లాయి. డిసెంబర్ ఒకటిన జరిగే పోలింగ్‌ కోసం… ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా నియమితులైన 21 వేల మంది సిబ్బందికి ఎర్పాటు చేశారు. నగరంలో వివిద చోట్ల 30 కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్ణయించారు. ఈ శిక్షణకు హాజరు కావాల్సిందిగా జీహెచ్ఎంసీ రెండు రోజుల క్రితమే వారికి సమాచారం అందించారు. వీరికీ శిక్షణ ఇచ్చేందుకు 166 మాస్టర్ ట్రైనీలను కూడా సిద్ధం చేశారు. 2020, నవంబర్ 24వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలనుండి ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి 4 గంటల వరకు 30ప్రాంతాల్లో శిక్షణ కూడా ఇచ్చారు. ఈ ట్రైనింగ్‌కు చాలా మంది డుమ్మా కొట్టారు.




30-35 శాతం గైర్హాజరు : 

గ్రేటర్ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు చాలా మంది అధికారులు జంకుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సెలెక్ట్‌ చేసిన వారిలో 30 నుండి 35శాతం మంది ఉద్యోగులు ట్రైనింగ్‌కు గైర్హాజరయ్యారు. అంటే దాదాపు 21వేలల్లో 7వేల మంది ఈ శిక్షణకు హాజరు కాలేదు. దాంతో బల్దియా అధికారులు ఒక్కసారిగా కంగుతున్నారు. ఇంత మంది విధులకు హాజరు కాకపోవడంపై ఆరాతీశారు. సిటిలో ఉన్న కరోనా భయమే జిల్లాలనుండి ఎన్నికల డ్యూటికి రాకుండా చేసిందని తెలిసింది.



https://10tv.in/bjp-top-leaders-campaign-for-five-days-in-hyderabad/
మరో అవకాశం :
ఎలక్షన్‌ ట్రైనింగ్‌కు హాజరుకాని పీవోలకు, ఏపీవోలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం మరోసారి ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ తమకు కేటాయించిన శిక్షణ కేంద్రంలో హాజరుకావాలని లోకేష్‌కుమార్‌ ఆదేశించారు. లేకుంటే షోకాజ్‌ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. చూడాలి మరి ఎన్నికల ట్రైనింగ్‌కు ఎంతమంది హాజరవుతారో.