గాంధీలో కరోనా బాధితుడు మృతి…వైద్యులపై మృతుడి సోదరుడు దాడి
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.

హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులపై దాడి సరికాదని ఆసుపత్రి సూపరిండెంట్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను వైద్యారోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లామని శ్రవణ్ తెలిపారు.
దాడికి నిరసనగా జూడాల ఆందోళన
కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రాణాలు సైతం పణంగా పెట్టిన తమపై దాడికి దిగడం ఏమిటంటూ గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు ప్రశ్నించారు. మృతుని బంధువులు దాడికి నిరసనగా జూడాలు ఆందోళను దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ జూడాలకు సర్దిచెప్పి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తామని సీపీ హామీ ఇవ్వడంతో వైద్యులు ఆందోళన విరమించారు. అయితే దాడి చేసిన వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో.. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు.
దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై జరిగిన దాడిని మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల స్పష్టం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటే వారిపై దాడులు చేయడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. 24 గంటలు వైద్యులు ప్రజల కోసం పనిచేస్తున్నారని.. వారి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి ఈటల భరోసానిచ్చారు.