కరోనా సాయం.. 20లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలు ప్రకటించనున్న నిర్మలా సీతారామన్

కరోనా దెబ్బకు దేశం విలవిలలాడుతుంది. ఈ సమయంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలయ్యింది. కరోనా విపత్తు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మరికొన్ని రోజులు లాక్డౌన్ కొనసాగక తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 20లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది.
జాతిని ఉద్ధేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోడీ.. కుప్పకూలుతున్న భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యడంలో భాగంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇది భారత జీడీపీలో దాదాపు 10 శాతమని ప్రకటించారు మోడీ. ప్యాకేజీని ప్రజలకు అందజేసే అంశాలపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తారని కూడా చెప్పారు.
ఈ క్రమంలోనే ఇవాళ(13 మే 2020) సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వివరించి చెప్పనున్నారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల ప్రజలకు ఎలా లబ్ధి చేకూరనుందన్న విషయాలపై ఆమె ప్రకటన చేయనున్నారు.
భారత్ అంతర్జాతీయంగా పోటీ పడేలా ఈ ప్యాకేజీ ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు వెల్లడించారు. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించగా.. ఇప్పటికే జపాన్ తమ జీడీపీలో 21 శాతం, అమెరికా 13 శాతం విలువైన ప్యాకేజీలను ప్రకటించాయి. ఆ తర్వాత అది పెద్ద ప్యాకేజీని ప్రకటించిన దేశంగా భారత్ నిలిచింది.
Read Here>> మోడీ హెడ్లైన్ పెట్టారు.. సీతారామన్ పూర్తి చేస్తారు: చిదంబరం