తెలంగాణలో కరోనా తగ్గుముఖం, ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలి – ఈటెల

Covid 19 Cases Decrease In Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా (Corona) వైరస్ తగ్గుముఖం పట్టిందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆంక్షల నడుమ పండుగలు జరుపుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆరోగ్య శ్రీ (Aarogyasri) లో అనేక సంస్కరణలు చేపడుతున్నట్లు, భయం పోయి..అవగాహన శక్తి పెరిగిందన్నారు. లక్షణాలున్నా..టెస్టులు చేయించుకోకపోవడం, వైరస్ సోకిన వారు నిబంధనలు పాటించకపోవడం వల్ల చనిపోతున్నారని తెలిపారు. గతంలో ఆరోగ్య శాఖ ఎలాంటి అప్రమత్తగా, చర్యలు చేపట్టిందో..అలాంటి చర్యలే భవిష్యత్ లో తీసుకుంటామని, వైరస్ నిర్మూలన అయ్యే వరకు చేస్తామన్నారు.
కరోనా వైరస్ కారణంగా పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకోలేదన్నారు. వచ్చే బతుకమ్మ, దీపావళి పండుగలను ఎలాగైతే పాటించామో..అదే పద్ధతి పాటించాలన్నారు. ఎవరు ఇళ్లల్లో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో బిల్లులు చూసిన సమయంలో పేద ప్రజానీకానికి నాణ్యమైన, ఉచితంగా వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. రాబోయే కొద్దికాలంలో ప్రభుత్వపరమైన వైద్యమే గొప్పదని చూపిస్తామన్నారు మంత్రి ఈటెల.