Covid Positive Cases : తెలంగాణలో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

Covid Cases
Telangana covid positive cases : తెలంగాణలో కొన్ని జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కట్టడి చేస్తున్నప్పటికీ కంట్రోల్ అవడం లేదు. నాలుగు జిలాల్లో పదుల సంఖ్యలో రోజువారి కేసులు నమోదు అవుతున్నటు ఆరోగ్య శాఖ విడుదల చేసే బులిటెన్‌లో చూపిస్తోంది. నిజానికి వందల సంఖ్యలో నమోదు అవుతున్నటు ఆఫ్ ది రికార్డు చర్చ జరుగుతోంది. అయితే ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. జిల్లాల్లో కట్టడి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాల పర్యటనలో ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల్లో విపరీతంగా కేసులు నిర్ధారిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అర్బన్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక ప్రచారంతో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో కరోనా కేసులు పెరుతున్నాయని చెప్తున్నారు అధికారులు. అయితే ఆ జిల్లాలో పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. హుజురాబాద్, ఇల్లoతకుంటా, గంగాధర, కొత్తపేటలో పర్యటిస్తున్నారు. అలాగే మెడికల్ ఆఫీసర్లతో భేటి అయ్యారు.
కరీంనగర్ జిల్లాలో కోవిడ్ థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస్ ఆదేశించారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ద్వారా నియంత్రించాలని చెప్పారు. మెడికల్ ఆఫీసర్లు కోవిడ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న గ్రామాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఆదేశించింది ప్రభుత్వం. ప్రతిరోజు జిల్లాలో 8 నుంచి 9 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కువ జన సమూహాలు ఉన్న చోట మొబైల్ బృందాల ద్వారా కోవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు. ఇంటింటి జ్వరం సర్వేను నిరంతరంగా కొనసాగించాలని ఆదేశించారు.
రాష్ట్ర స్థాయి అధికారులు రెండు బృందాలు వీడిపోయి జమ్మికుంట అర్బన్, జమ్మికుంట రూరల్, మానకొండూర్‌లో పర్యటించనున్నారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనాతో మరణించడానికి దారి తీసిన కారణాలు, చికిత్స అందిన విధానంపై విచారణ జరుపనున్నారు. అంతేకాకుండా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డాక్టర్లను డీహెచ్ శ్రీనివాస్ ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, అంటు వ్యాధులు ఎక్కువ నమోదవుతున్న గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
గ్రామాలలో కోవిడ్ పరీక్షల సంఖ్య, పాజిటివ్ వచ్చిన కేసుల వివరాలను ప్రతిరోజు జిల్లా కేంద్రానికి పంపించాలని సూచించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి కోవిడ్ కిట్లు అందజేసి కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని అధికారుకు ఆదేశాలు జారీ చేశారు.