Covid recovered : ఆరోగ్యాన్నిచ్చిన ఆసుపత్రి ముందు మొక్కలు నాటిన కరోనా విజేత సుజాత

Covid Recovered Wome Sujata
covid recovered Women planted : కరోనా సోకి ఆక్సిజన్ లేక శ్వాస తీసుకోవటం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఓ మహిళను తెలంగాణలోని గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె చికిత్స పొంది కోలుకుంది. కరోనా మహమ్మారిని జయించింది. ఆస్పత్రి నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యింది. ఆ తరువాత ఆమె అదే ఆస్పత్రి ముందుకొచ్చింది. తనకు చికిత్స చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించిన డాక్టర్లకు..వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ అదే ఆస్పత్రి ముందు మొక్కలు నాటింది.
జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రిలో కరోనాను జయించిన సుజాత ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి మానవత్వం చాటుకుంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న మహిళ కరోనా బారినపడి ఆరోగ్యం విషమించింది. చనిపోతుందేమోననే పరిస్థితికి చేరింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆక్సిజన్ కొరతతో ఆమెకు ప్రాణవాయువు అందలేదు. దీంతో సుజాత తీవ్ర నిరాశకు గురయ్యింది.శ్వాస తీసుకోవటానికి నానా అవస్థలు పడింది. ఆక్సిజన్ గద్వాల ఏరియా ఆసుపత్రిలో ఉందన్న బంధువుల సమాచారంతో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడే చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత కరోనాను జయించింది.
పూర్తి ఆరోగ్యవంతురాలిగా బైటకొచ్చింది. ఆ కృతజ్ఞతతో సుజాత తనకు ఆరోగ్యాన్నిచ్చిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఆస్పతి ముందు మొక్కలు నాటి రుణం తీర్చుకుంది. ఈ సందర్భాగా సుజాత భర్త మధు మాట్లాడుతూ ఆక్సిజన్ అందించి మా భార్యకు ఊపిరిపోసి బ్రతికించిన గద్వాల జిల్లా ఆసుపత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి అనేక మంది ప్రాణాలను బలిగొన్న చిత్రాలు చూస్తూనే ఉన్నాం.ఆక్సిజన్ అందక కొంతమంది, వెంటిలేటర్లు లేక కొంతమంది చనిపోతున్న దారుణాలు అనేకం జరుగుతున్న విషయం తెలిసిందే.