Sitaram Yechury : ఆ నియోజకవర్గాల్లో మా మద్దతు కాంగ్రెస్ పార్టీకే.. మూడు రాష్ట్రాల్లో ఆపార్టీ అధికారంలోకి వస్తుంది

బీజేపీ ఓటమికోసం సీపీఎం కృషిచేస్తోందని సీతారాం ఏచూరి తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఇదే వైఖరి అవలంభిస్తున్నామని చెప్పారు.

Sitaram Yechury : ఆ నియోజకవర్గాల్లో మా మద్దతు కాంగ్రెస్ పార్టీకే.. మూడు రాష్ట్రాల్లో ఆపార్టీ అధికారంలోకి వస్తుంది

Sitaram Yechury

Telangana Elections 2023 : తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంపై సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీపీఎం పోటీ చేస్తున్న స్థానాల్లో కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో మా మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని, ఇందులో భాగంగానే సీపీఎం అభ్యర్థులు పోటీలోలేని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే మా మద్దతు ఉంటుందని అన్నారు. బీజేపీకి మేం యాంటీ టీమ్ గా ఉంటామని అన్నారు.

Also Read : Amit Shah : అవినీతి తప్ప అభివృద్ధి లేదు .. కేజీ టు పీజీ విద్యను గాలికొదిలేశారు : అమిత్ షా

పొత్తులు విషయంపై కాంగ్రెస్ నే అడగాలి..
బీజేపీ ఓటమికోసం సీపీఎం కృషిచేస్తోందని సీతారాం ఏచూరి తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఇదే వైఖరి అవలంభిస్తున్నామని చెప్పారు. సీపీఐ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుంది. సీపీఎంకు కాంగ్రెస్ తో పొత్తు కుదరల్లేదని అన్నారు. తెలంగాణలో పొత్తులు ఎందుకు కుదరలేదనే విషయాన్ని కాంగ్రెస్ వారినే అడగాలని సీతారాం ఏచూరి అన్నారు. దేశం మొత్తం మేం కాంగ్రెస్ తోనే వెళుతున్నాం. తెలంగాణలో కుదరలేదని తెలిపారు. ఇండియా ప్లాట్ ఫాం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. కేరళ రాష్ట్రంలో పొత్తు ఉండదు. మిగతా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు ఆలోచన చేయాల్సి ఉంటుందని అన్నారు.

Also Read : Tunnel Accident Rescue Update: రెస్క్యూ ఆపరేషన్ పనులకు పదేపదే అడ్డంకులు.. కార్మికుల కోసం కుటుంబ సభ్యుల ఎదురు చూపులు

కాంగ్రెస్ గెలిచే రాష్ట్రాలివే..
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సీతారాం ఏచూరి జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుందని, రాజస్థాన్ లో పోటాపోటీ ఉంది. కానీ, బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని సీతారాం ఏచూరి అన్నారు. ఉద్యోగ కల్పన లేదు. ధరల పెరుగుదల బీజేపీ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటుందని సీతారాం ఏచూరి అన్నారు. మోదీ ప్రభుత్వంలో ఎవ్వరికీ జవాబుదారీతనం లేదు. ఎన్నికల కమిషన్ మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా నోటీసులు ఉండవు, అదే ప్రతిపక్షాలకు మాత్రం నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Telangana BJP: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నలుగురు బీజేపీ అగ్రనేతలు.. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేస్తారంటే..

తెలంగాణలో హంగ్ వస్తే ..
తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ నిస్సందేహంగా బీజేపీ సపోర్ట్ తీసుకుంటుందని సీతారాం ఏచూరీ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వైఖరి తీసుకున్నా ఆ పార్టీలకు వ్యతిరేకంగానే మేం ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా అధికారం చేజిక్కించుకునే చరిత్ర వారికుంది. సీబీఐ, ఈడీని వారు వాడుకుంటున్నారని విమర్శించారు.

చంద్రబాబు అరెస్టు విషయంపై సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ ను సీపీఎం ఖండించిందని, అసలు వాస్తవం త్వరలో బయటపడుతుందని అన్నారు.

ప్రధాని మోదీ మణిపూర్ కు మాత్రం వెళ్లలేదు.. కానీ, ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు మాత్రం వెళ్లారని సీతారాం ఏచూరి విమర్శించారు. రూ.16లక్షల కోట్ల రుణాలు మోదీ ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ సమస్య కార్పొరేట్ ఫండింగ్ వల్ల ఉత్పన్నమవుతుందని అన్నారు. స్మార్ట్ మీటర్స్ ను వ్యతిరేకిస్తున్నామని సీతారాం ఏచూరి చెప్పారు.