KTR : కరెంట్ కావాలా…కాంగ్రెస్ కావాలా : మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ డిక్లరేషన్ లు చెత్త కాగితాలతో సమానమని, వాళ్ళ సొల్లు మాటలను ప్రజలు వినరని పేర్కొన్నారు. రేవంత్ మూడు గంటల పవర్ పై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

KTR : కరెంట్ కావాలా…కాంగ్రెస్ కావాలా : మంత్రి కేటీఆర్

KTR Comments Congress

Updated On : November 11, 2023 / 9:55 PM IST

KTR Comments Congress : కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు క్రాప్ హాలిడే లు.. పరిశ్రమలకు పవర్ హాలిడే లు ఉండేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దిక్కు మాలిన కరెంట్ తో వేల కుటుంబాలను చిదిమి వేసిందని విమర్శించారు. కరెంట్ కావాలా…కాంగ్రెస్ కావాలా రైతులు ఆలోచించుకోవాలని తెలంగాణ రైతులకు కోరుతున్నామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ అంటున్న కాంగ్రెస్ ను ప్రజలు నిలదియాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ అంటే పంటల కోతలు.. కాంగ్రెస్ అంటే పవర్ కోతలు అని పేర్కొన్నారు. ధరణి కంటే మెరుగైన పార్టల్ అంటే ఎవరు నమ్మరని తెలిపారు. కాంగ్రెస్ డిక్లరేషన్ లు చెత్త కాగితాలతో సమానమని, వాళ్ళ సొల్లు మాటలను ప్రజలు వినరని పేర్కొన్నారు. రేవంత్ మూడు గంటల పవర్ పై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విద్యుత్ విధానం మూడు గంటలా… ఐదు గంటలా అని ప్రశ్నించారు.

PM Modi : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు : ప్రధాని మోదీ

తెలంగాణ రైతులపై రేవంత్ తన అవగాహన లేమిని, వైఖరిని ప్రకటించారని తెలిపారు. అమెరికాలో రేవంత్ అజ్ఞానంతో మాట్లాడారని అనుకున్నాం కానీ, కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా తేటతెల్లం అయిందన్నారు. 3 గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానమని స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆలోచనా విధానంతో రైతులు 10 ఏళ్ళ క్రితం పరిస్థితికి వెళ్తారని చెప్పారు. 70 లక్షల మంది రైతులను కాంగ్రెస్ నేతలు బిచ్చగాళ్లతో పోలుస్తారని పేర్కొన్నారు.