SI Rajender : నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మాయం.. సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ అరెస్టు, రిమాండ్ కు తరలింపు
గతంలో రాయదుర్గంలో రాజేందర్ ఎస్సైగా పని చేసినప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికి పోయాడు. గతంలోనూ రాజేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ కేసులో సస్పెండ్ అవడంతో హైకోర్టులో స్టే తెచ్చుకుని రాజేందర్ తిరిగి సైబర్ క్రైమ్ లో ఎస్సైగా చేరారు.

SI Rajender remand
SI Rajender Remand : సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు ఆరెస్ట్ చేశారు. డ్రగ్స్ నిందితులను పట్టుకున్న టీమ్ లో సైబర్ క్రైం ఎస్ఐ రాజేందర్ ఉన్నారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో ఎస్ఐ కొంత మాయం చేశారు. విచారణలో ఎస్ఐ రాజేందర్ డ్రగ్స్ దాచి పెట్టి అమ్మాలని చూశాడు. ఉన్నతాధికారుల విచారణలో నిజాలు తేలడంతో ఎస్ఐని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు.
గతంలో రాయదుర్గంలో రాజేందర్ ఎస్సైగా పని చేసినప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికి పోయాడు. గతంలోనూ రాజేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ కేసులో సస్పెండ్ అవడంతో హైకోర్టులో స్టే తెచ్చుకుని రాజేందర్ తిరిగి సైబర్ క్రైమ్ లో ఎస్సైగా చేరారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ తో పాటు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజేందర్ విధులు నిర్వహిస్తున్నాడు.
Assam : బీజేపీ ఎంపీ ఇంట్లో ఉరివేసుకున్న 10 ఏళ్ల బాలుడు.. ఆత్మహత్యకు కారణం ఏంటంటే?
రాయదుర్గం ఏసీబీ కేసులో రాజేందర్ ను సర్వీస్ నుంచి తొలగిస్తూ కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాజేందర్ ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నారు. మళ్లీ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లోనే ఎన్ డీపీ ఎస్ యాక్ట్ కేసులో అరెస్టు చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో రాజేందర్ ఎస్సైగా పని చేస్తున్నారు. ఏడాది ఫిబ్రవరిలో సైబర్ నేరంలో భాగంగా రాజేందర్ ముంబయి వెళ్లారు.
అక్కడ సైబర్ మోసానికి పాడ్పడుతున్న నైజీరియన్ రాజేందర్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో నైజీరియన్ వద్ద ఉన్న 1,750 గ్రాముల మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా రాజేందర్ తన వెంట తెచ్చుకున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో దాచుకున్న మాదకద్రవ్యాలను విక్రయించేందుకు రాజేందర్ ప్రయత్నించారు. దీనిపై రాష్ట్ర నార్కోటిక్ విభాగం పోలీసులకు సమాచారం అందింది.
Amit Shah : తెలంగాణలో అమిత్ షా పర్యటన.. ఖమ్మం సభలో పాల్గొననున్న కేంద్రహోంమంత్రి
దీంతో రాయదుర్గం పీఎస్ పరిధిలో ఉండే రాజేందర్ ఇంటిపై నార్కోటిక్ విభాగం పోలీసులు దాడి చేసి 80 లక్షల రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాయదుర్గం పీఎస్ పోలీసులకు రాజేందర్ ను అప్పజెప్పారు. రాయదుర్గం పోలీసులు రాజేందర్ పై ఎన్ డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.