Dasoju Sravan: కేసీఆర్‌ని ఏమైనా చేయాలని కుట్ర చేస్తున్నారా?: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

రేవంత్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Dasoju Sravan: కేసీఆర్‌ని ఏమైనా చేయాలని కుట్ర చేస్తున్నారా?: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

Dasoju Sravan Kumar

Updated On : March 14, 2025 / 7:27 PM IST

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పిర్యాదు చేశారు. అనంతరం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.

ఓ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి కలిసి ఏమైనా హత్య చేయాలని కుట్ర చేస్తున్నారా అని శ్రవణ్ ప్రశ్నించారు. అనుమానాస్పద ఘటనలు జరిగితేనే డెడ్ బాడీలు మార్చురీకి వెళ్తాయని అన్నారు. కేసీఆర్ ని ఏమైనా చేయాలని కుట్ర చేస్తున్నారా అని నిలదీశారు. మృతదేహాలు ఎలా మార్చురీకి వెళ్తాయి అని ప్రశ్నించారు.

Also Read: నాగబాబుకి విషెస్ చెబుతూ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్‌

“మీరు చేస్తున్న తప్పుడు వాగ్దానాలు ప్రశ్నిచినదుకా మార్చురీకి పోయేది? అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినందుకా? రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడి పదవిని కొన్నారని సాక్షాత్తు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డే అన్నారు. నీవంటే ఏంటో మీ నాయకులకు తెలుసు. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి” అని దాసోజు శ్రవణ్ అన్నారు.

మార్చురీ అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇలాంటి భాషను పిల్లలు కూడా నేర్చుకుంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాట్లాడిన భాషపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.