దిల్‌సుఖ్‌నగర్ 2013 జంట పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసిన హైకోర్టు
అంతకుముందు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

High Court
దిల్‌సుఖ్‌నగర్ 2013 జంట పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
కాగా, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాప్, మిర్చిపాయింట్ వద్ద బాంబులు పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 18 మంది మృతి చెందారు. మరో 131 మందికి గాయాలయ్యాయి.
Also Read: టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్..
ఈ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ పరారీ ఉన్నాడు. మిగతా ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు 2016 డిసెంబరులో ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అసదుల్లా అక్తర్, జియా ఉర్ రహమాన్, మహ్మద్ తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్‌కి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది.
అనంతరం వారు ఆ కోర్టు తీర్పును రద్దు కోసం హైకోర్టు అప్పీళ్లు చేసుకున్నారు. జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పును ఖరారు చేస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది.
కాగా, 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లు హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ రోజు దిల్‌సుఖ్‌నగర్‌లో గాయపడ్డవారు హాహాకారాలు చేశారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ ఇప్పటికీ దొరకలేదు.