Corona తగ్గినా Doctorను ఇంట్లో పెట్టి తాళం వేశారు

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 07:22 AM IST
Corona తగ్గినా Doctorను ఇంట్లో పెట్టి తాళం వేశారు

Updated On : June 26, 2020 / 8:42 PM IST

ఇటీవల కరోనావైరస్ నుంచి కోలుకున్న డాక్టర్‌ను పొరుగింటి వాళ్లే ఇంట్లో పెట్టి తాళం వేశారు. అంతేకాకుండా ఇంటికి తిరిగొచ్చినందుకు బండబూతులు తిట్టాడు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో COVID-19కు ట్రీట్‌మెంట్ చేస్తున్న క్రమంలో డాక్టర్‌కు కరోనా పాజిటివ్ సోకింది. కొద్ది రోజులుగా హాస్పిటల్లో కరోనా ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. 

కరోనా నుంచి కోలుకుని బుధవారం దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉంటున్న ఇంటికి చేరుకున్నారు డాక్టర్. కరోనా తగ్గినప్పటికీ హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఆమెను చూసిన పొరుగింటి వ్యక్తి ఇంకెక్కడికైనా వెళ్లకుండా ఇక్కడకు ఎందుకొచ్చినట్లు అంటూ తిట్లు మొదలుపెట్టాడు. 

అంతేకాకుండా ఆమె ఏదైనా సమయంలో బయటకు వస్తుందేమో అనే అనుమానంతో ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఆమె ఇంట్లోనే ఉండి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వచ్చి తాళం తీయించారు. మనీశ్ అనే పొరుగింటి వ్యక్తిపై కేసు ఫైల్ చేశారు. 

Read Here>> INDIAలో Coronavirus సెకండ్ వేవ్ మొదలైపోయిందా.. CHINAను దాటేస్తామంటోన్న గణాంకాలు