ఎలక్ట్రిక్ బస్సులో సచివాలయంకు భట్టి, పొన్నం.. డ్రైవ్ చేసిన మంత్రి వెంకట్ రెడ్డి

టీఎస్ఆర్టీసీ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకివ చ్చాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, వెంకటరెడ్డిలు ప్రారంభించారు.

ఎలక్ట్రిక్ బస్సులో సచివాలయంకు భట్టి, పొన్నం.. డ్రైవ్ చేసిన మంత్రి వెంకట్ రెడ్డి

Electric Green Metro Buses

Updated On : March 12, 2024 / 1:11 PM IST

Electric Green Metro Buses : టీఎస్ఆర్టీసీ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకివ చ్చాయి. మంగళవారం నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు జెండాఊపి వీటిని ప్రారంభించారు. అనంతరం నూతన ఎలక్ట్రిక్ బస్సును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నడపగా.. భట్టి, పొన్నం ప్రభాకర్ లు బస్సులో కూర్చొని సచివాలయం వరకు వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొని ప్రసంగించారు.

Also Read : లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మల్లికార్జున్ ఖర్గే దూరం.. కారణం అదేనా?

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలకోసం ఇబ్బండి పడేవారని, ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడుతూనే ఉంటుందని భట్టి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని భట్టి చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేర్చుతూ, అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతుందని భట్టి పేర్కొన్నారు.