Telangana : ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ
పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Ts Jobs
Details of job replacement : తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 91,142 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
అలాగే 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు. 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Telangana : రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు భర్తీ.. జిల్లాల వారిగా వివరాలు
జిల్లా స్థాయిలో 39, 829 ఉద్యోగ ఖాళీలు, జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగ ఖాళీలు, మల్టీ జోన్ లో 13,170 ఉద్యోగ ఖాళీలు, ఇతర కేటగిరిచ, వర్సిటీల్లో 8,174 పోస్టులు, గ్రూప్1-503, గ్రూప్ 2-582 పోస్టులు, గ్రూప్3 -1373 పోస్టులు, గ్రూప్ 4-9168 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్, కామర్స్- 233
యూత్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16