DGP Mahender Reddy : తెలంగాణ పోలీసు శాఖ వార్షిక రిపోర్టు…4.56 శాతం క్రైమ్ రేటు పెరిగింది
2021లో తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా..మావోయిస్టు రాష్ట్ర రహితంగా చేయడంలో పోలీసు శాఖ సఫలీకృతమైందన్నారు.

DGP Mahender Reddy
DGP Mahender Reddy : గత సంవత్సరంతో పొలిస్తే..ఈ సారి 4.56 క్రైమ్ రేట్ పెరిగిందని, నేరం చేసిన వారికి 50.03 శాతం శిక్షలు పడేలా చేయడం జరిగిందన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. 2021 సంవత్సరంలో కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో..ప్రజల వెంట పోలీసు శాఖ ఉందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ…కోవిడ్ వారియర్స్ గా పని చేశామన్నారు. 2021లో తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా..మావోయిస్టు రాష్ట్ర రహితంగా చేయడంలో పోలీసు శాఖ సఫలీకృతమైందన్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్రంలో మావోయిస్టులు అడుగు పెట్టకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 2021 సంవత్సరం పోలీసు శాఖకు సంబంధించిన వివరాలను ఆయన 2021, డిసెంబర్ 31వ తేదీన మీడియాకు తెలిపారు.
Read More : Telangana : నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
98 మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు, 133 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. 8 ఫైర్ ఆమ్స్ క్యాష్ మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నట్లు, కమ్యునల్ ఇష్యూస్ లేకుండా చేశామన్నారు. బైంసాలో చిన్న సంఘటన తప్ప ఎక్కడ మేజర్ ఘటనలు జరగలేదని చెప్పారు. లైఫ్ కన్వెక్షన్స్ తో పాటు డెత్ కన్వెక్షన్స్ పడేలా చేసినట్లు, 11 లక్షల 100 కాల్స్ వచ్చినట్లు..7 మినిట్స్ లో స్పందించామన్నారు. మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పీఠ వేసినట్లు, 5145 ఫిర్యాదులు షీ టీమ్స్ కు వచ్చినట్లు తెలిపారు.
సోషల్ మీడియాను పోలీస్ శాఖ విరివిగా ఉపయోగించుకుటూ…అందులో వచ్చిన ఫిర్యాదులను కూడా స్వీకరిస్తున్నామన్నారు. మీ సేవ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకున్నట్లు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.
Read More : Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..
55 లక్షల మందిని సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించామన్నారు. 6.5 లక్షల మందిని కళాబృందాల ద్వారా జాగృతి పరిచినట్లు, సీసీటీవీ (CCTV) కెమెరాల ద్వారా అనేక కేసులను గుర్తించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి గంజాయి పెద్ద సమస్యగా మారిందని, గంజాయి వల్లనే ప్రధానంగా కేసులు నమోదు అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ – డ్రగ్ అరికట్టే విషయంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని, నూతన టెక్నాలజీతో 25 వేల సైబర్ క్రైమ్ కేసులను డిటెక్ట్ చేయగలిగామన్నారు. పోలీస్ శాఖ వెల్ఫేర్ ను ప్రభుత్వం తన భుజాలపై వేసుకోని నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది 11 జాతీయ- అంతర్జాతీయ అవార్డులు వచ్చాయన్నారు.