జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఇక్కడ జరిగేది ఇదే: బీజేపీ ఎంపీ అర్వింద్

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ భద్రంగా ఉందని చెప్పారు.

జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఇక్కడ జరిగేది ఇదే: బీజేపీ ఎంపీ అర్వింద్

MP Arvind

Updated On : April 29, 2024 / 1:01 PM IST

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. తాను చెప్పిన పనులన్నీ చేశానని తెలిపారు. జగిత్యాల జిల్లాలో అర్వింద్ మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తనకు ఇదే లాస్ట్ ఎలక్షన్ అని జీవన్ రెడ్డి చెబుతున్నారని అన్నారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని తెలిపారు.

ఒకవేళ జీవన్ రెడ్డి గెలిస్తే లవ్ జీహాదికి అడ్డాగా మారుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ భద్రంగా ఉందని చెప్పారు. మహిళా గ్రూపులకు లోన్లు, వడ్డీ రాయితీని మోదీ ఇచ్చారని తెలిపారు. రాజీవ్ గాంధీ బొమ్మ లేదని ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వట్లేరని అన్నారు.

చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణం జీవన్ రెడ్డేనని అర్వింద్ చెప్పారు. రొళ్లవాగు జగిత్యాల నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిదని అన్నారు. నీళ్లు వస్తలేవు కానీ నిధులు, కమీషన్లు వస్తున్నాయని తెలిపారు. 45 ఏళ్లలో జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు.

ఈ ఎన్నికలు ధర్మాన్ని, దేశాన్ని కాపాడే ఎన్నికలని అర్వింద్ అన్నారు. గల్ఫ్ గోసలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని తెలిపారు. కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

9 సీట్లు ఒకే కులానికా.. ఇదెక్కడి అన్యాయం?: రేవంత్‌పై విరుచుకుపడ్డ మోత్కుపల్లి