నీ కుటుంబంలో ఇలా అయితే..సినిమా తీస్తావా ఆర్జీవీ ? దిశ తండ్రి, మహిళా సంఘాల ఆందోళన

  • Published By: madhu ,Published On : October 11, 2020 / 12:12 PM IST
నీ కుటుంబంలో ఇలా అయితే..సినిమా తీస్తావా ఆర్జీవీ ? దిశ తండ్రి, మహిళా సంఘాల ఆందోళన

Updated On : October 11, 2020 / 12:31 PM IST

Disha Father : నీ కుటుంబంలో ఇలా అయితే..సినిమా తీస్తావా ఆర్జీవీ అంటూ ప్రశ్నిస్తున్నారు దిశ తండ్రి, మహిళా సంఘాలు. ఆయన కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. రౌడీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

దిశ ఘటన ఆధారంగా..తీసిన సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఇలా జరిగితే..ఆ ఇతివృత్తంతో సినిమా తీస్తారా అని ప్రశ్నిస్తున్నారు. యువతిని దారుణంగా హత్య చేస్తే..దాని ఆధారంగా..సినిమా తీయడం ఎంత వరకు సమంజసం అంటున్నారు.

దిశ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అంతా అయిపోయిందని మరిచిపోతున్న తరుణంలో ఇలాంటి సినిమా తీయడం ఎంత వరకు కరెక్టు అని మహిళా సంఘాల నేతలు ప్రశ్నించారు. ఆయన నోటికి వచ్చినట్లు సినిమా తీస్తున్నారని, ఎమీ చేయలేరని ఆర్జీవీ అనుకుంటున్నారని, సైకోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

యూ ట్యూబ్ లో విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని, సమాజం ఎలా హర్షిస్తుందని దిశ తండ్రి వెల్లడించారు. తన కూతురు ఎలా చదివింది ? ఎలా జాబ్ సంపాదించుకుందో తెలుసుకోవాలని తెలిపారు. సుప్రీంకోర్టుకైనా వెళుతానని స్పష్టం చెప్పారు.

దిశ తండ్రి డిమాండ్స్ : ,
1. సినిమా విడుదల కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 2. యూ ట్యూబ్ నుంచి ట్రైలర్ డిలీట్ చేయాలి. 3. రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పాలి. 4. దిశ సినిమాను వెంటనే నిలిపివేయాలి.