Karimnagar Doctors : గాయపడిన పామును ఆపరేషన్ చేసి బతికించిన వైద్యులు

కమాన్ చౌరస్తా సమీపంలో గాయాలతో బాధపడుతున్న పామును గమనించిన జంతు ప్రేమికులు పశు వైద్యశాలకు తీసుకెళ్లి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పశు వైద్యులు వెంటనే స్పందించి పామును పరీక్షించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి పామును బతికించారు.

Karimnagar Doctors : గాయపడిన పామును ఆపరేషన్ చేసి బతికించిన వైద్యులు

Doctors Operation Snake

Updated On : June 29, 2023 / 1:42 PM IST

Doctors Operation To Snake : పాము పేరు వింటేనే భయపడిపోతాం.. పాము కనిపిస్తే ఆమడదూరం పరుగెత్తుతాం.. విషకరమైన పాములైతే కొంత మంది ధైర్యం చేసి వాటిని కొట్టి చంపేస్తారు. కానీ, డాక్టర్లు గాయపడిన ఓ పాముకు ఆపరేషన్ చేసి బతికించారు. కరీనంగర్ కు చెందిన కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం పాము మీద జాలి చూపించారు.

కమాన్ చౌరస్తా సమీపంలో గాయాలతో బాధపడుతున్న పామును గమనించిన జంతు ప్రేమికులు పశు వైద్యశాలకు తీసుకెళ్లి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పశు వైద్యులు వెంటనే స్పందించి పామును పరీక్షించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి పామును బతికించారు.

Uttar Pradesh : పామును కొరికి చంపేసిన మూడేళ్ల పిల్లాడు..

ప్రస్తుతం ఆ పాము పరిస్థితి మెరుగ్గా ఉందని పశు వైద్యులు తెలిపారు. అయితే, గతంలో కూడా పాముకు ఆపరేషన్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవలే మంగళూరులో ప్లాస్టిక్ మూత మింగి తీవ్ర ఇబ్బంది పడుతున్న పాముకు పశు వైద్యులు చికిత్స చేశారు.

ముందుగా పాము పొట్టకు ఎక్స్ రే తీసి ప్లాస్టిక్ మూత మింగినట్లు గుర్తించారు. ఆ తర్వాత పాముకు మత్తు మందు ఇచ్చి, ఆక్సిజన్ మాస్క్ తొడిగి మరీ ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. దాదాపు 15 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.