మనది లౌకికవాదం : బక్రీదు పండుగకు ఆవుల్ని వధించొద్దు : మంత్రి మహమూద్ ఆలీ

  • Published By: nagamani ,Published On : July 26, 2020 / 01:24 PM IST
మనది లౌకికవాదం : బక్రీదు పండుగకు ఆవుల్ని వధించొద్దు : మంత్రి మహమూద్ ఆలీ

ముస్లింల సోదరుల పండుగ బక్రీద్ వేడుక సందర్భంగా ఆవుల్ని వధించవద్దని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు.‌ బక్రిద్ పండుగ సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఎం మహేందర్ రెడ్డితో మంత్రి మహమూద్ అలీ సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బక్రీద్ సందర్భంగా ఆవులను వధించవద్దని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు..మతాలు ఒక్కటేనని అన్ని మతాలను, కులాలను గౌరవించుకుంటున్నామని..మన సీఎం లౌకవాదంతో పాలన సాగిస్తున్నారనీ తెలంగాన రాష్ట్రంలో లౌకికవాదంతో ముందుకెళ్లుతోందనీ..ఇదే తరహాలో బక్రీద్‌ను ఆవుల్ని వధించకుండా జరుపుకొందామన్నని మంత్రి పిలుపునిచ్చారు.

కుతుబ్ షాహీ పాలనలో కూడా లౌకికవాదం ఉండేదనీ…ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హైదరాబాలోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌లోని 4 మినార్లను హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు‌లుగా భావిస్తామన్నారు. అంతేకాదు బక్రీద్ పండుగ రోజున మాంసాహార వ్యర్థాలను రోడ్లపై పారవేయవద్దని విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రత పట్ల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. బక్రీద్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డితో ఆయన సమీక్ష నిర్వహించారు.