కొత్త రైళ్లు.. హైదరాబాద్ టు మహబూబ్‌నగర్ మధ్య డబుల్ లైన్

Double Line Railway : హైదరాబాద్ మహానగరం నుంచి మహబూబ్ నగర్ మధ్య రైల్వే డబుల్ లైన్ రాబోతోంది. వచ్చే జూన్ నెలలో డబుల్ లైన్ మీదుగా కొత్త రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. బెంగళూరు, తిరుపతిలకు హైదరాబాద్ నుంచి త్వరలో కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. ముందుగా హైదరాబాద్-మహబూబ్ నగర్ మధ్య రెండో
రైలు మార్గం వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ డబుల్ లైన్ రైల్వే మార్గానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు ప్రస్తుతానికి సింగిల్ లైన్ మాత్రమే ఉంది. డోన్ నుంచి రెండు రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయి. సింగిల్ రైల్వే లైన్ కావడంతో
ఎక్కువ రైళ్లు నడిపేందుకు అనుకూలంగా ఉండేది కాదు.. ఇప్పుడు కొత్త డబుల్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తుండటంతో మరికొన్ని రైళ్లు ఇదే మార్గంలో పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటివరకూ సింగిల్ లైన్ కావటంతో ఈ మార్గంలో ఎక్కువ రైళ్లు నడిపే అవకాశం లేకుండా పోయింది. రాజధాని లాంటి ప్రీమియం కేటగిరీ
రైళ్లను మహబూబ్‌నగర్ మీదుగా కాకుండా వికారాబాద్, గుంతకల్లు మీదుగా సర్వీసులను నడుపుతున్నాయి. కొత్త డబుల్ లైన్ ద్వారా మహబూబ్‌నగర్ మీదుగా బెంగళూరు 50కిలోమీటర్లు కంటే తక్కువ దూరం ఉంటుంది. తిరుపతికి కూడా ప్రధాన మార్గం ఇదే. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి ఐదు
ప్రధాన రైళ్లు నడుస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులకు ఒక్కోదాన్ని ఒక్కో రూట్‌లో నడుపుతున్నారు. కాజీపేట మీదుగా ఒకటి, నడికుడి మీదుగా రెండోది, వికారాబాద్ మీదుగా మూడోది, వికారాబాద్ నుంచి పాకాల మీదుగా నాలుగోది, మహబూబ్‌నగర్ మీదుగా ఐదో లైన్ మీదుగా నడుస్తున్నాయి. హైదరాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ పని పూర్తయితే ఈ మార్గం మీదుగా తిరుపతికి మరికొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.