BRS Politics In Bhadradri District : భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్‌లో విభేదాలు.. వనమా Vs రేగా
సీఎం కేసీఆర్ పర్యటనతో భద్రాచలం కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్‌లో విభేధాలు బయటపడ్డాయి. సీఎ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఎమ్మెల్యే వనమా, రేగా పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

BRS Politics In Bhadradri district
BRS Politics In Bhadradri district : సీఎం కేసీఆర్ పర్యటనతో భద్రాచలం కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్‌లో విభేధాలు బయటపడ్డాయి. సీఎ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఎమ్మెల్యే వనమా, రేగా పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో కొత్త కలెక్టరేట్ ను అలాగే బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా వనమా, రేగా ఎవరికి వారే పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య విభేధాలు బయటపడ్డాయి. కాగా..తుమ్మల వర్గీయులతో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఇటీవల నిర్వహించిన సమావేశం కాస్తా స్థానికంగా పార్టీని రెండుగా చీల్చింది.
రెండుసార్లు విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గులాబీ పార్టీకి దాదాపు అన్ని జిల్లాల్లోను పట్టు ఉంది. ఎనిమిదిన్నరేళ్లుగా తెలంగాణలో పరిపాలన సాగిస్తోన్న గులాబీ పార్టీ గ్రామస్థాయి నుంచి క్యాడర్ ను నిర్మించుకుంది. అన్ని ప్రాంతాలపై పట్టు సాధించింది. అన్ని చోట్ల బలమైన నేతలని కారెక్కించింది. అయితే… ఆ ఒక్క ఖమ్మం జిల్లా. కేసీఆర్ కు ఇంకా కొరకరాని కొయ్యగానే సవాల్ విసురుతోంది ఖమ్మం జిల్లా.
తెలంగాణకు గుమ్మంగా జిల్లాలో పార్టీకి పెద్ద నాయకుల బలం ఉన్నా..వారిలో ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో.. ఎవరెప్పుడు ఏ పార్టీలోకి దూకుతారో అనే అయోమయం గులాబీ దళాన్ని వెంటాడుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు అంతగా తలనొప్పులు తెస్తోంది ఖమ్మం జిల్లా..