Dasara Holidays: రేపటి నుంచి దసరా సెలవులు.. పాఠశాలలు పున: ప్రారంభం ఎప్పుడంటే?

రేపటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు షురూ కానున్నాయి. ఈనెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.

Dasara Holidays: రేపటి నుంచి దసరా సెలవులు.. పాఠశాలలు పున: ప్రారంభం ఎప్పుడంటే?

Dasara holidays

Updated On : September 24, 2022 / 2:55 PM IST

Dasara Holidays: తెలంగాణలో ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా సెలవులు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 15 రోజులపాటు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. అయితే, సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (SCERT) అభ్యంతరం వ్యక్తం చేసినా విద్యాశాఖ మాత్రం వెనక్కి తగ్గలేదు. సెలవులను తగ్గించేది లేదని స్పష్టం చేసింది. దీంతో తొలుత ప్రభుత్వం ప్రకటించినట్లుగానే రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు అమల్లోకి రానున్నాయి.

Balakrishna : ఎన్టీఆర్ పేరు మార్పుపై బాలయ్య మాస్ వార్నింగ్

దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. రేపు ఆదివారం కావటంతో రేపటి నుంచి సెలవులు షురూ అయినట్లు. తిరిగి అక్టోబర్ 10వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతీయేటా దసరాకు 10 నుంచి 14రోజుల వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తూ వస్తుంది.

Rohit Sharma: టీ20ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ.. ఎన్ని సిక్స్‌లు కొట్టాడంటే?

గత రెండు రోజుల క్రితం దసరా సెలవులు ప్రభుత్వం కుదించిందని వార్తలు వచ్చాయి. సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సెలవులు అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు మాత్రమే ఇస్తారని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం 26నుంచే సెలువులు ఉంటాయని స్పష్టం చేసింది. సెలవులు షురూ కావడంతో హాస్టల్స్, వసతి గృహాలు, పట్టణాల్లో ఉండి చదువుకొనే విద్యార్థులు తమతమ సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. ఊళ్లకు వెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ సైతం అదనపు బస్సులను ఏర్పాటు చేసింది.