Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ వదంతులను ఖండించిన ఈసీ..

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులను మీసేవలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ..

Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ వదంతులను ఖండించిన ఈసీ..

New Ration Cards

Updated On : February 8, 2025 / 7:01 PM IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు ఈసీ బ్రేక్ అంటూ వస్తున్న వదంతులను ఎన్నికల సంఘం ఖండించింది. రేషన్ కార్డుల జారీని ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈసీ తోసిపుచ్చింది. రేషన్ కార్డుల అంశంపై సివిల్ సప్లయ్స్, మీసేవ మమ్మల్ని సంప్రదించలేదని ఈసీ వెల్లడించింది.

కాగా.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరిగింది.

అటు.. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులను మీసేవలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ నిన్న రాష్ట్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేయని వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డులతో పాటు పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు మీసేవ ద్వారా దరఖాస్తులు పెట్టుకోవాలంది.

Also Read : మన ‘చంద్రుడు’ మబ్బుల్లోకి వెళ్లాడంతే.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. కేసీఆర్ సీఎం పక్కా : కేటీఆర్ కామెంట్స్!

రేషన్ కార్డుల జారీ అంశంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది నిరంరత ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణను వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు కూడా ఇచ్చింది.