తెలంగాణలో గొర్రెల పంపిణీ పథక అక్రమాల విలువ రూ.1,000 కోట్లపైనే: ఈడీ సంచలన ప్రకటన
గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో కేవలం ఏడు జిల్లాల్లోనే 253.93 కోట్ల అక్రమాలు ఈ పథకంలో జరిగినట్లు ఉందని చెప్పింది.

తెలంగాణలో గొర్రెల పంపిణీ పథక అక్రమాల విలువ రూ.1,000 కోట్లపైనే ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేశామని, 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్ బుక్కులను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది.
ఈ బ్యాంకు ఖాతాలను ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్‌లోనూ ఉపయోగించారని ఈడీ పేర్కొంది. సోదాల అనంతరం 31 మొబైల్ ఫోన్లను, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని వివరించింది.
గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో కేవలం ఏడు జిల్లాల్లోనే 253.93 కోట్ల అక్రమాలు ఈ పథకంలో జరిగినట్లు ఉందని చెప్పింది. 33 జిల్లాలు కలిపి చూస్తే రూ.1,000 కోట్ల విలువకు పైబడే గొర్రెల పంపిణీ అక్రమాలు జరిగాయని పేర్కొంది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని స్పష్టం చేసింది.