ESI-IMS Scam : ఈఎస్‌ఐ-ఐఎంఎస్ స్కామ్‌లో ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
ఈఎస్‌ఐ-ఐఎంఎస్ స్కామ్‌లో 10 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నాయిని నర్సింహ్మారెడ్డి కుమారుడు దేవేందర్‌రెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు.

Ed Searches In Esi Ims Scam Seize Of Key Documents
ED searches in ESI-IMS scam : ఈఎస్‌ఐ-ఐఎంఎస్ స్కామ్‌లో 10 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నాయిని నర్సింహ్మారెడ్డి కుమారుడు దేవేందర్‌రెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. నాయిని మాజీ పీఎస్ ముకంద్‌రెడ్డి, దేవికారాణి సహా నిందితుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. డీడీ కాలనీలోని నాయిని మాజీ పీఎస్ ముకుందరెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో దివంగత నాయిని నర్సింహ్మారెడ్డి అల్లుడితోపాటు కుమారుడి ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
వారి సమక్షంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలోని నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈఎస్ఐ-ఐఎంఎస్ కుంభకోణం విషయంలో ఏసీబీ ఇచ్చిన లేఖ ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.