Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు .. మండిపడుతున్న ప్రయాణీకులు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. ఎటువంటి సమాచారం లేకుండా ఇలా అర్థాంతరంగా విమానాలను రద్దు చేయటంతో హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లిల్సిన ప్రయాణీకులు మండిపడుతున్నారు.

8 Air India flights canceled from shamshabad airport
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. ఈ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించే ఎనిమిది ఎయిర్ ఇండియా విమనాలు రద్దు చేసింది సరదు సంస్థ. ఎటువంటి సమాచారం లేకుండా ఇలా అర్థాంతరంగా విమానాలను రద్దు చేయటంతో హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లిల్సిన ప్రయాణీకులు మండిపడుతున్నారు. సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించే విమానాలు రద్దు కావటంతో ప్రయాణీకులు మండిపడుతున్నారు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కాల్సిన ప్రయాణీకులు తెల్లవారుఝామునే ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.కానీ అప్పటికే ఎయిర్ ఇండియా 8 విమానాలను రద్దు చేయటంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్ – తిరుపతి, హైదరాబాద్ – బెంగుళూరు, హైదరాబాద్ – వైజాగ్, హైదరాబాద్ – మైసూర్, హైదరాబాద్ – చెన్నై, తిరుపతి – హైదరాబాద్, బెంగుళూరు – హైదరాబాద్, చెన్నై – హైదరాబాద్
సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. ఆపరేషన్నల్స్ కారణంగా ఎనిమిది విమానాలు రద్దు చేసినట్లుగా ఎయిర్ఇండియా విమానాయాన సంస్థ అధికారులు ప్రకటించారు. విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో ప్రయాణికులు అందోళన చెందుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విమానాలను రద్దు చేయడం పట్ల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల అందోళనతో స్పందించిన అధికారులు టిక్కెట్ల డబ్బులు రిఫండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.