ED Notice To Navdeep : నటుడు నవదీప్కు ఈడీ నోటీసులు, 10న హాజరుకావాలని ఆదేశం
టాలీవుడ్ నటుడు నవదీప్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో విచారణ కోసం ఈనెల 10న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

ED Notice To Actor Navdeep : టాలీవుడ్ నటుడు నవదీప్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ కోసం ఈనెల 10న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు డ్రగ్స్ కన్జ్యూమర్ గా పేర్కొన్న నేపథ్యంలో ఓ సారి నార్కోటిక్ బ్యూరో విచారణ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. 10తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ తో సంబంధాలున్నట్లుగా నార్కోటిక్ బ్యూరో విచారణలో గుర్తించింది.
కాగా గత నెలలో నగరంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి డ్రగ్స్ సరఫరా విషయాలో ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో భాగంగా పలువురుని అదుపులోకి తీసుకన్నారు. వీరిలో నైజీరియాకు చెందిన వ్యక్తులతో పాటు ఓ దర్శకుడు, మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.వీరి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని విచారించగా నటుడు నవదీప్ కు వారితో సంప్రదిపులు జరిపినట్లుగా తెలుసుకున్నారు. దీంతో నవదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే హీరో నవదీప్ ను పోలీసులు విచారించారు. ఈక్రమంలో మరోసారి నోటీసులు జారీ చేయటంతో పాటు అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశించారు.
కాగా డ్రగ్స్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోరుతు పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సెప్టెంబర్ 19 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై నవదీప్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.