BJP Unemployment March : ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్.. ఫ్లెక్సీలో కనిపించని ఈటల రాజేందర్ ఫొటో
ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీ బృందం భేటీ అయింది. బీజేపీలోకి రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు.

BJP unemployment march
Etala Rajender Photo Missing : ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్ తలపెట్టింది. బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరయ్యారు. స్టేజీతో పాటు ఫ్లెక్సీలలో ఎక్కడ కూడా చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఫొటో కనిపించలేదు. ఈటల ఫొటో వ్యవహారంపై లోకల్ బీజేపీ క్యాడర్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీ బృందం భేటీ అయింది. బీజేపీలోకి రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు.
Bandi Sanjay Kumar : ప్లీజ్.. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తరిమి తరిమి కొడతాం-బండి సంజయ్
బీజేపీలోకి రావాలని గత కొన్ని రోజులుగా పొంగులేటి పై ఈటల తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి సమయంలో ఖమ్మంలో తాజాగా జరుగుతున్న బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ప్రోగ్రాంలో ప్లెక్సీలలో ఈటల ఫొటో లేకపోవడంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.