ఇక ప్రతి ఏడాదిలో దసరా మరుసటి రోజు సెలవు : కేసీఆర్

ఈ నెల (అక్టోబర్ 26) దసరా సెలవుదినంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రతి ఏడాదిలో దసరా మొదటి రోజు సెలవుదినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబంధించి షెడ్యూల్ రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. 2019 జూలై 1 నుంచి బకాయి ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు.
33.536 శాతం నుంచి 38.776 శాతం బేసిక్ పే ఆధారంగా డీఏ వర్తింపు చేయనుంది ప్రభుత్వం. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తామన్నారు.