సిట్టింగ్ ఎమ్మెల్యేతో పోటీపడి మాజీ ఎమ్మెల్యే హల్‌చల్.. పబ్లిక్ అటెన్షన్ కోసం కాన్వాయ్‌గా వెళ్తూ హడావుడి
అందుకే నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా..పది ఇరవై మందిని వెంటేసుకుని..ఐదారు కార్లలో రయ్‌రయ్‌మని హల్‌చల్ చేస్తున్నారట.

పాలిటిక్స్ అంటేనే రేసు. అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా పబ్లిక్‌లో ఎప్పుడూ తమ గురించే చర్చ జరగాలని లీడర్లు కోరుకోవడం కామన్. ఒకరి ప్లస్‌లు, మైనస్‌లు మరొకరు అడ్వాంటేజ్‌గా తీసుకోవడం కూడా పాలిటిక్స్‌లో భాగమే. కాకపోతే షాద్‌నగర్ రాజకీయాలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయట. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..నియోజకవర్గంలో..భారీ కాన్వాయ్, అనుచరులతో హల్‌చల్ చేస్తూ టాక్ ఆఫ్ ది షాద్‌నగర్‌గా ఉంటున్నారట.
మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ కుమార్ రెడ్డి కూడా కాస్త హడావుడి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా కనీసం ఐదు వాహనాల కాన్వాయ్‌తో వెళ్తున్నారట. ఇక ఎటోచ్చి సమస్యల్లా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కే వచ్చిపడిందట. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా, మాస్ పాలిటిక్స్ చేస్తూ..పబ్లిక్ అటెన్షన్‌ను గ్రాబ్ చేసుకోవడంలో వెనకబడిపోతున్నానని ఫీల్ అయిపోయారట అంజన్న. ఒక కారులో వచ్చి వెళ్తే ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని పెద్ద స్కెచ్చే వేశారట.
Also Read: ఆ ప్రాంతంలో తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్.. అధిష్ఠానం నచ్చజెప్పినా లీడర్ల నో కాంప్రమైజ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే, సొంత పార్టీ ఎమ్మెల్సీకి పోటీగా..తానేం తక్కువ కాదని..అంజయ్య యాదవ్ కూడా కాన్వాయ్ మెయింటెన్ చేస్తున్నారట. అపోజిషన్‌లో ఉంటేనేం..గత ఎన్నికల్లో ఓడితేనేం..తానేం తక్కువ కాదంటూ రయ్ రయ్‌మని దూసుకెళ్తున్నారట. రాజకీయంగా ఉనికిలో ఉండాలంటే హడావిడి చేయడమే ఉత్తమ మార్గమని భావించిన ఆయన..ఏకంగా ఐదు కొత్త స్కార్పియో వాహనాలను కొన్నారట.
వాహనాలకు పూజ చేసి గ్రాండ్‌గా ర్యాలీ
నియోజకవర్గంలో తాను ఎక్కడికి వెళ్లినా తన వాహనంతో పాటు ఈ ఐదు కార్లు కాన్వాయ్‌గా రావాలని అనుచరుగనానికి ఆర్డర్స్ ఇచ్చేశారట. కొత్తగా కొన్న ఈ ఐదు వాహనాలకు పూజ చేసి గ్రాండ్‌గా నియోజకవర్గంలో ర్యాలీ తీశారట. మాజీ ఎమ్మెల్యే అంజన్న వేసిన ఈ స్కెచ్ షాద్‌నగర్ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారి తీసింది.
అంజయ్య యాదవ్ సౌమ్యుడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన హంగు, ఆర్భాటాల జోలికి వెళ్లేవారు కాదట. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందీ శీనా.. తప్పట్లేదు అంటున్నారట ఇప్పుడు. ఇదంతా చూసిన జనం ఎంత కష్టం వచ్చెనే అంజన్న అని చర్చించుకుంటున్నారట. పదేళ్లు ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగి, ఉద్యమ టైమ్‌లోనూ తనకంటూ ఓ పేరును సంపాదించుకున్న అంజయ్య యాదవ్..పబ్లిక్ అటెన్షన్ కోసం ఏకంగా కాన్వాయ్‌ని మెయింటెన్ చేయడం అయితే..అసలైన పబ్లిక్ అటెన్షన్ స్కెచ్చేనన్న టాక్ వినిపిస్తోంది.
సాదాసీదాగా..ఒకే కారులో వెళ్తే..వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ చిత్రపటంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే అనుమానం అంజయ్య యాదవ్‌ను వెంటాడిందట. అందుకే నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా..పది ఇరవై మందిని వెంటేసుకుని..ఐదారు కార్లలో రయ్‌రయ్‌మని హల్‌చల్ చేస్తున్నారట. ఏదైనా తన ఉనికిని కాపాడుకునేందుకు అంజయ్య యాదవ్ పెద్ద స్కెచ్చే వేశారని అంటున్నారు పబ్లిక్. మరీ అంజన్న అటెన్షన్ గ్రాబింగ్ స్కెచ్ వర్కౌట్ అయ్యేనా.? కాన్వాయ్ ఆయన రాజకీయ ఉనికిని కాపాడుతుందా లేదా అనేది వేచి చూడాలి.