కారును చెరువులోకి పోనిచ్చి పిల్లలతోకలిసి ఆత్మహత్యకు యత్నించిన తండ్రి.. కాపాడిన స్థానికులు

హైదరాబాద్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన అశోక్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. తన ముగ్గురు పిల్లలతో కలిసి

కారును చెరువులోకి పోనిచ్చి పిల్లలతోకలిసి ఆత్మహత్యకు యత్నించిన తండ్రి.. కాపాడిన స్థానికులు

Father Suicide Attempt With three Kids

Car Crashed Into Pond : హైదరాబాద్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన అశోక్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. తన ముగ్గురు పిల్లలతో కలిసి కారులో అబ్దుల్లాపూర్ మెంట్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడా చెరువు వద్దకు వచ్చిన అశోక్.. కారును వేగంగా చెరువులోకి పోనిచ్చి పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నకు ప్రయత్నించాడు. కారు చెరువులో మునిగిపోతుండటాన్ని గమనించిన సాయి అనే వ్యక్తి స్థానికుల సహాయంతో నీటిలోకిదూకి అశోక్ తోపాటు కారులోని ముగ్గురు పిల్లలను ఓడ్డుకు తీసుకొచ్చారు.

Also Read : Fishes : రైలు పట్టాల మధ్య ఈత కొడుతూ చేపలు సందడి.. వీడియో వైరల్

సాయి, స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసుకురావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్ చేద్దామని పిల్లలను కారులో తీసుకొచ్చిన అశోక్.. పిల్లలతో కలిసి చనిపోయేందుకు ప్లాన్ వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్లాపూర్ మెంట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అశోక్ ను మందలించగా.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించినట్లు పోలీసులకు తెలిపాడు.