Fishes : రైలు పట్టాల మధ్య ఈత కొడుతూ చేపలు సందడి.. వీడియో వైరల్

ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్ లపైకి వర్షపు నీరు చేరింది.

Fishes : రైలు పట్టాల మధ్య ఈత కొడుతూ చేపలు సందడి.. వీడియో వైరల్

fishes on railway tracks

Mumbai Rains : భారీ వర్షాలు ముంబైను ముంచెత్తాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా ముంబైలోని పలు వీధులు చెరువులను తలపిస్తున్నాయి. మంగళవారం వరుణుడు కాస్త శాంతించినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు జలదిగ్భందంలోనే ఉన్నాయి. బుధవారం మహారాష్ట్ర, మరఠ్వాడా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయ్ గడ్ లో ఎల్లో అలర్ట్ జారీ కాగా.. ముంబైలో ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.

Also Read : పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. 18మంది మృతి.. మృతులంతా ఆ ప్రాంతంవారే

ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్ లపైకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీస్సులు రద్దుకాగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. అంధేరి రైల్వేస్టేషన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్‌లపైకి వర్షపు నీరు చేరడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే ట్రాక్ ల మధ్య వర్షపునీరు నిలిచి ఉండటంతో ఆ నీటిలోకి చేపలు పెద్ద సంఖ్యలో వచ్చిచేరాయి. రైల్వే ట్రాక్ లపై నిలిచిఉన్న నీటిలో చేపలు అటూఇటూ ఈదుతుండటంతో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.