పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. 18మంది మృతి.. మృతులంతా ఆ ప్రాంతంవారే

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ వద్ద డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది.

పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. 18మంది మృతి.. మృతులంతా ఆ ప్రాంతంవారే

Road ACcident in Unnao

Updated On : July 10, 2024 / 9:07 AM IST

UP Road Accident : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ వద్ద డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సులోని 18మంది మృతి చెందగా.. 19మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. లక్నో – ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బీహార్ లోని మోతిహారి నుంచి ఢిల్లీ వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను బంగార్‌మావ్ సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరికొన్ని బస్సు సీట్ల మధ్య ఇరుక్కుపోయాయి.

Also Read : Rohit Sharma : రోహిత్ శ‌ర్మ భావోద్వేగ‌పు పోస్ట్.. రాహుల్‌ భాయ్‌ నా నమ్మకం, నా కోచ్‌, నా స్నేహితుడు ..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఉన్నావ్ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదం ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది. దీంతో పలు మృతదేహాలు బస్సులోని సీట్ల మధ్య ఇరుక్కుపోయాయి. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మృతుల్లో 14 మంది పురుషులు కాగా.. ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

Also Read : Gautam Gambhir : టీమిండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్‌ ఆస్తి ఎంతో తెలుసా? ఎన్ని కార్లు ఉన్నాయంటే ..