రూ. 30 కోసం కొడుకును చంపేసిన తండ్రి, మద్యం ఎంత పని చేసింది

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 12:10 PM IST
రూ. 30 కోసం కొడుకును చంపేసిన తండ్రి, మద్యం ఎంత పని చేసింది

Updated On : September 5, 2020 / 1:02 PM IST

Telangana Crime : 5 రూపాయల ఫ్యాక్షన్ విన్నాం. 10 రూపాయల కోసం హత్య చేసుకోవడం చూశాం. ఇప్పుడు 30 రూపాయల కోసం హత్య జరిగిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అదీ… కన్నకొడుకుని 30 రూపాయల కోసం చంపేయడం విస్మయానికి గురిచేస్తోంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.




మందుబాటిల్‌కు 30 రూపాయల తగ్గువయ్యాయని..ఇవ్వాలని.. కొడుకుని అడిగితే ఇవ్వకపోవడంతో కోపంతో ఊగిపోయిన ఆ తండ్రి క్షణికావేశంలో కత్తి తీసుకుని దారుణానికి ఒడిగట్టాడు. పడుకున్న కొడుకు మీద కత్తితో దాడి చేసి హతమార్చాడు.

గత కొన్నేళ్లుగా మంచిర్యాల జిల్లా ధర్మారం గ్రామంలో పర్సకారి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన పర్సకారి డబ్బుల కోసం తరుచూ తన పిల్లలను వేధిస్తూ వస్తున్నాడు. కొడుకు గంగుని డబ్బుల కోసం వేధించడంతో అతడు తిరగబడ్డాడు.




అతడూ కాస్త మద్యం మత్తులో ఉండడంతో ఇరువురి మద్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. ఇక తండ్రితో గొడవ పెట్టుకున్న గంగు మద్యం మత్తులో మెల్లగా నిద్రలోకి జారుకోగా… అప్పటికీ కోపం తగ్గని పర్సకారి గంగుపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

30 రూపాయిలు అడిగితే ఇవ్వకపోవడంతోనే హత్య చేశానని పర్సకారి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. మద్యం మనిషిని ఎంతలా దిగజారుస్తుంతో, ఎలాంటి దారుణాలు చేయిస్తుందో ఈ ఘటనే రుజువు చేస్తోంది. మందు పడితే మనుషులు మానవత్వం మరిచిపోతున్నాడు. చిల్లర కోసం కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తున్నాడు. తరుచూ ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరగడం ఆందోళన కలిగిస్తోంది.