Appi Reddy : కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న సినీ నిర్మాత అప్పి రెడ్డి.. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాల్లో

ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పిరెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Appi Reddy : కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న సినీ నిర్మాత అప్పి రెడ్డి.. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాల్లో

Film producer Appi Reddy

Updated On : August 25, 2023 / 5:27 PM IST

Film Producer Appi Reddy : కాంగ్రెస్ సీటు కోసం సినీ నిర్మాత అప్పి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల టికెట్ కోసం జార్జి రెడ్డి సినిమా నిర్మాత అప్పి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అప్పి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాలు హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అప్పి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పి రెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉత్తమ్ దంపతులు పోటీ చేసినా మద్దతు ఇస్తానని, తనకు అవకాశం ఇచ్చినా తాను పోటీ చేస్తానని చెప్పారు.

Telangana Politics: అల్లుడికి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా కేసీఆర్‭తో ఫైట్ ఆగదంటున్న సర్వే సత్యనారాయణ

మరోవైపు హైదరాబాద్ గాంధీ భవన్ కు టిక్కెట్ దరఖాస్తుల వెల్లువ సాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తులు 900 దాటాయి. చివరి రోజు కావడంతో సాయత్రం వరకు దరఖాస్తుల సంఖ్య వెయ్యి దాటుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.