Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సన్నబియ్యం రేట్లు ఢమాల్..
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సన్నబియ్యం ధరలు ఒక్కసారిగా దగ్గుముఖం పట్టాయి.

Thin rice
Telangana: తెలంగాణలో ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్నబియ్యంను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. వాటిని చాలా మంది లబ్ధిదారులు డీలర్లకు లేదా దళారులకు విక్రయించేవారు. వారు ఇంట్లోకి మార్కెట్లో సన్నబియ్యం కొనుగోలు చేసుకునేవారు. దీంతో సన్న బియ్యంకు రేట్లు భారీగా ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సన్నబియ్యం ధరలు ఒక్కసారిగా దగ్గుముఖం పట్టాయి.
Also Read: Bhu Bharati: భూభారతి పోర్టల్ ప్రారంభంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. పోర్టల్ లోగో ఎలా ఉంటుందంటే?
రేవంత్ సర్కార్ రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తుండటంతో మార్కెట్ లో సన్నబియ్యంకు డిమాండ్ తగ్గింది. గత నెల వరకు ఫైన్ క్వాలిటీ రైస్ క్వింటాకు రూ.5,500 నుంచి రూ.6,500 వరకు పలకగా.. ఇప్పుడు అవే వెరైటీలు క్వింటాకు రూ.5వేల నుంచి రూ.6వేల వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో కొత్త బియ్యం క్వింటా రూ. 5వేల వరకే విక్రయిస్తున్నారు. ఇక పాత బియ్యం రకాల్లో సోనా మసూరి రూ.5,400, ఆర్ఎన్ఆర్ రూ.5,400, హెచ్ఎంటీ రూ.5,600, జైశ్రీరాం రూ.5,500 వరకు విక్రయిస్తున్నారు. మరో రెండుమూడు నెలల్లో సన్న బియ్యం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.
సన్నవడ్లు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వాటినే బియ్యంగా మార్చి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. గత వానాకాలంలో సన్నొడ్ల సాగు పెరిగింది. మొత్తం కోటి 53లక్షల ధాన్యం మార్కెట్ కు వచ్చింది. ఇందులో దాదాపు 60శాతం సన్నొడ్లే. అందులో 24లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. 4.41 లక్షల మంది రైతులకు రూ.1.199 కోట్లు బోనస్ రూపంలో చెల్లించింది.