KTPP : భూపాలపల్లి కేటీపీపీలో మరో ప్రమాదం

10 రోజుల వ్యవధిలో కేటీపీపీలో ఇది రెండో ప్రమాదం. వరుస ప్రమాదాలతో కేటీపీపీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

KTPP : భూపాలపల్లి కేటీపీపీలో మరో ప్రమాదం

Ktpp

Updated On : May 5, 2022 / 4:50 PM IST

fire broke out : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ లోని కేటీపీపీలో మరో ప్రమాదం జరిగింది. రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మంటలు చెలరేగాయి. యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ పంప్ మోటర్ లో మంటలు చెలరేగాయి.

బాటమ్ యాష్ ఓవర్ ఫ్లో పంప్ మోటార్ కాలిపోయింది. కార్మికులు లేకపోవడంతో ముప్పు తప్పింది. వరుసగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలతో కలకలం రేగుతోంది. 10 రోజుల వ్యవధిలో కేటీపీపీలో ఇది రెండో ప్రమాదం. వరుస ప్రమాదాలతో కేటీపీపీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Singareni Accident: భూపాలపల్లి సింగరేణి కేటీకే-5వ ఇంక్లైన్ లో తప్పిన ముప్పు

ఏప్రిల్ 25న చెల్పూర్ కేటీపీపీలో భారీ ప్ర‌మాదం జరిగింది. రాత్రి ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఏడుగురు ఉద్యోగులు గాయపడ్డారు. వారిలో ఇద్ద‌రు కేటీపీపీ ఉద్యోగులు కాగా, మిగతా ఐదుగురు కూలీలు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్పందించిన అధికారులు గాయ‌ప‌డ్డవారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

కేటీపీపీ మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్ లో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. కోల్ పంపించే మిల్లులో ఉన్న‌ట్టుండి మిల్లర్ పేలింది. ఈ పేలుడు కార‌ణంగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. గాయపడిన వారిలో ఒకరు ఆర్టిజన్, మరొకరు జేపీఏ కాగా, మరో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒకటో యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది.