Hyderabad: మణికొండ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన జనం

అపార్ట్ మెంట్ లో మంటలు వ్యాపించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు అగ్నిమాపక శకటాలతో వారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు

Hyderabad: మణికొండ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన జనం

Fire Incident

Updated On : November 16, 2024 / 9:28 AM IST

Fire Incident: హైదరాబాద్ మణికొండ పరిధి పుప్పాలగూడలో భారీ అగ్నప్రమాదం చోటు చేసుకుంది. గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో అపార్ట్ మెంట్ వాసులు భయంతో పరుగులు పెట్టారు. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటల కారణంగా అపార్ట్ మెంట్ లోని వంటగదిలో ఉన్న సిలీండర్ సైతం పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ప్లాట్ లోని ఐదుగురు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనలో ప్లాట్ పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.

Also Read: మెడికల్ కాలేజీలో 10 మంది నవజాత శిశువులు సజీవదహనం.. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటంటే?

ఇదిలా ఉంటే.. అపార్ట్ మెంట్ లో మంటలు వ్యాపించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు అగ్నిమాపక శకటాలతో వారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, అపార్ట్ మెంట్ వద్ద ఫైర్ ఇంజిన్ పోవడానికి దారి లేకపోవటంతో గంటసేపు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. నిబంధనలకు విరుద్దంగా అపార్టు మెంట్ నిర్మాణం ఉండటంతోనే ఫైర్ ఇంజిన్లు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రయత్నాలు చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్ట్ మెంట్ లో దాచుకున్న డబ్బులు, దుస్తులు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని దర్యాప్తు చేప్టటారు. ప్లాట్ లో షార్ట్ షర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.