Siddipet: అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

ఆలయం దగ్గర ఉన్న మూలమలుపు వద్ద ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వెంటనే గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.

Siddipet: అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

Updated On : January 10, 2023 / 7:58 PM IST

Siddipet: సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు గుంతలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు. ఈ ఘటన జగదేవపూర్ మండలం మునిగడప శివారు మల్లన్నగుడి దగ్గర మంగళవారం మధ్యాహ్నం జరిగింది.

Virat Kohli: సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ నమోదు

ఆలయం దగ్గర ఉన్న మూలమలుపు వద్ద ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వెంటనే గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ మిగతా ఇద్దరినీ ఆస్పత్రులకు తరలించారు. అయితే, మార్గమధ్యలోనే మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కారు నుంచి మృతదేహాల్ని బయటకు తీసి, పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా యాదాద్రి భువనగరి జిల్లా బీబీనగర్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని తెలుస్తోంది.