Virat Kohli: సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ నమోదు

తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Virat Kohli: సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ నమోదు

Virat Kohli: భారత స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డు సమం చేశాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఇండియాలో సచిన్ 20 సెంచరీలు నమోదు చేశాడు.

Bengaluru: రోడ్డుపై కుక్క కనిపిస్తున్నా కారు ఆపని డ్రైవర్.. కారు పైనుంచి వెళ్లడంతో కుక్క మృతి.. కేసు నమోదు

తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 80 బంతుల్లోనే కోహ్లీ ఈ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ ద్వారా కోహ్లీ తాజా రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో 20 సెంచరీలు చేసేందుకు సచిన్ 160 ఇన్నింగ్స్ ఆడితే, కోహ్లీ 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇది కోహ్లీకి 45వ వన్డే సెంచరీ. శ్రీలంకపై కోహ్లీకి ఇది 9వ సెంచరీ.

West Bengal: మధ్యాహ్న భోజనంలో పాము.. అన్నం తిన్న పలువురు విద్యార్థులకు అస్వస్థత

శ్రీలంకపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. 2019 తర్వాత నుంచి ఇప్పటివరకు కోహ్లీ ఇండియాలో సెంచరీ నమోదు చేయలేకపోయాడు. తాజా సెంచరీతో కోహ్లీ ఈ లోటును కూడా తీర్చాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ మరో సెంచరీ చేస్తే, సచిన్ రికార్డును అధిగమించినట్లవుతుంది. దీంతో దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. గతంలో దాదాపు నాలుగేళ్లపాటు కోహ్లీ సెంచరీ సాధించలేకపోయాడు. కానీ, గత బంగ్లాదేశ్ పర్యటనలో 1214 రోజుల తర్వాత సెంచరీ సాధించి, మళ్లీ తన ఫామ్ నిరూపించుకున్నాడు.

వన్డేలు, టెస్టులతోపాటు ఒక టీ20 సెంచరీ ద్వారా కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 73 సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఇందులో వన్డేల్లో 45, టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి. సచిన్ 100 సెంచరీల తర్వాత, 73 శతకాలతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.