Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని అధికారులు తెలిపారు.

Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

Road accident

Updated On : September 20, 2023 / 6:52 PM IST

Road Accident – Nalgonda district:  నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం (Chintapalli Mandal) నర్సర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో ఓ బాలుడు సహా మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల వివరాలు
మద్దిమడుగు ప్రసాద్ (38), మద్దిమడుగు అవినాశ్ (12), పట్నపు మణిపాల్ (18), మద్దిమడుగు రమణ (35), వనం మల్లికార్జున్ (12)

అసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
పులి పవన్ (18), వరాల మనివర్ధన్ (18)

Niloufer Kidnap Case : పిల్లలు లేరని పిల్లాడ్ని ఎత్తుకుపోయిన దంపతులు .. నిలోఫర్ బాబు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు