Telangana Floods : వరద ప్రాంతాల్లో ఫ్లయింగ్ ఫోర్స్.. అన్నింటా డ్రోన్స్..!
Telangana Floods : వరదలో చిక్కుకుని ఆకలికి అలమటిస్తున్న పరిస్థితి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్‌లో..ఆపదలో అండగా నిలుస్తున్నాయి డ్రోన్లు. పడవలు, మనుషులు నడుచుకుంటూ వెళ్లలేని చోటుకు డ్రోన్ల ద్వారా సరుకుల పంపిణీ ఈజీ అవుతోంది.
Telangana Floods : పీకల్లోతు నీళ్లు.. ఎటు చూసినా దారి కనిపించని పరిస్థితి. నిస్సహాయ స్థితిలో వందలాది మంది. వరదలో చిక్కుకుని ఆకలికి అలమటిస్తున్న పరిస్థితి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్‌లో..ఆపదలో అండగా నిలుస్తున్నాయి డ్రోన్లు. పడవలు, మనుషులు నడుచుకుంటూ వెళ్లలేని చోటుకు డ్రోన్ల ద్వారా సరుకుల పంపిణీ ఈజీ అవుతోంది.
రాత్రింబవళ్లు లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్లు, నిత్యావసరాలు, వాటర్ బాటిళ్లూ అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారానే సాయం అందించే పరిస్థితికి డ్రోన్లు సరికొత్త మార్గం చూపించాయి. దాదాపు 30 కిలోల బరువున్న ఫుడ్ ప్యాకెట్ల బస్తాను ఒక డ్రోన్‌తో అపార్ట్‌మెంటు వాసులకు పంపిస్తున్నారు. దాదాపు 200 అడుగుల ఎత్తు వరకు ఎగిరే డ్రోన్ బాధితులకు ఆహార పదార్థాలను అందిస్తుంది.
ఇప్పటివరకు ప్రమాదాన్ని అంచనా వేయడానికి, పరిస్థితిని తెలుసుకోవడానికి మాత్రమే ఈ డ్రోన్లను వాడేవాళ్లం. ఇప్పుడు ఏకంగా వరదలో చిక్కుకుపోయినవారికి సహాయం అందించేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి డ్రోన్స్. ఖమ్మంలోని మున్నేరు వాగుపై చిక్కుకుపోయిన వారికి డ్రోన్ సాయంతో ఫుడ్ అందించారు అధికారులు.
చాలా ప్రాంతాల్లో ఇలానే డ్రోన్లతో సేవలు అందిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. డ్రోన్‌తో వరద బాధితులకు సాయం అందించడం చాలా ఏళ్లుగా సాగుతుంది. కానీ గతంలో అక్కడక్కడ మాత్రమే ఈ ఫెసిలిటీస్ ఉండేది. ఇప్పుడు డ్రోన్లను వాడటం బానే పెరిగింది. రెస్క్యూ టీమ్స్ చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్స్ ఈజీగా వెళ్లిపోతున్నాయి. ఫుడ్ ప్యాకెట్స్, లైఫ్ జాకెట్స్, అవసరమైన తాళ్లు, మందులు, మంచినీరు.. ఇలా పని ఏదైనా క్షణాల్లో చేసేస్తున్నాయి డ్రోన్స్.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో టెక్నాలజీదే కీరోల్ :
విపత్తుల సమయంలో డ్రోన్స్‌ను ఎలా వాడాలన్నదానిపై రెస్క్యూటీమ్స్‌కు ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నారు అధికారులు. అందుకే ఇలాంటి సమయంలో వీటిని ఉపయోగించడం ఈజీ అవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో మాత్రమే కాదు.. పరిస్థితిని అంచనా వేయడానికి కూడా డ్రోన్స్‌ను వాడుతున్నారు. వరదలు రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి.? వచ్చాక పరిస్థితి ఎలా ఉంది.? ఇలా క్రూషియల్ డేటాను కలెక్ట్ చేసేందుకు డ్రోన్స్‌ను యూజ్ అవుతున్నాయి.
వీడియోగ్రఫీ కంటే డ్రోన్ సర్వేనే బెస్ట్ అంటున్నారు అధికారులు.రెస్క్యూ ఆపరేషన్స్ అబ్జర్వేషన్‌కు కూడా డ్రోన్స్ వాడుతున్నారు. డిజాస్టర్ సమయాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు..అబ్జర్వేషన్ డ్రోన్స్, సాయం అందించడానికి రెస్క్యూ డ్రోన్స్, ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల కోసం వెతికేందుకు.. రాడార్ డ్రోన్స్. ఇలా పేరు ఏదైనా అవి చేసే పని ఒకటే. మనుషులకు సహాయ పడటం.
మనుషులు చేయలేని డేంజరెస్ వర్క్స్ ఈ డ్రోన్స్ చేసేస్తున్నాయి. దట్టమైన అడవిలో ఉన్నా..శిథిలాల కింద ఉన్నా..మంచుకొండల్లో ఉన్నా..వరదల్లో ఉన్నా..ఇలా టెరైన్ ఏదైనా.. డ్రోన్స్ అక్కడ వాలిపోతున్నాయి. యూపీలో ఆపరేషన్ బేడియా కోసం థర్మల్ ఇమేజ్ టెక్నాలజీ ఉన్న డ్రోన్స్ వాడారు. వయనాడ్‌లో శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించడానికి రాడార్ డ్రోన్స్‌ను వాడారు.
యుద్ధమైనా, సాయమైనా తప్పనిసరైన డ్రోన్లు.. :
ఇక విజయవాడలో వాన విలయం చూపించింది ఈ డ్రోన్సే. ఖమ్మం ఎలా జలదిగ్బంధంలో చిక్కుకుందో తెలిపింది ఈ డ్రోన్సే. ప్రస్తుతం మనుషులు ఏ చోటుకైనా వెళ్తుంది ఈ డ్రోన్సే. ప్రస్తుతం వరదల్లో శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న వారిలో ఈ డ్రోన్స్ కూడా వచ్చి చేరాయి. కానీ ఇది మాత్రమే సరిపోతుందా.? అంటే దానికి సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రోన్స్‌ను మరింత డెవలప్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నవన్ని చాలా చిన్న డ్రోన్స్. కొన్ని కంట్రీస్‌లో డ్రోన్స్‌తో ఏకంగా మనుషులను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. మనం ఈ విషయంలో కాస్త వెనకపడే ఉన్నామనే చెప్పొచ్చు.
మనరాష్ట్రంలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడలో వరద బీభత్సం సృష్టించడంతో ముంపులో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు ఎమర్జెన్సీ సేవల్లో డ్రోన్లను వాడి సక్సెస్ అయ్యారు. ఇప్పటిదాకా వరదలు, ఇతర పనులకు ఏరియల్సర్వే చేసేందుకు డ్రోన్లను వాడారు. మేడారం జాతర సమయంలోనూ డ్రోన్ కెమెరాల ద్వారా సర్వే చేసి అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే రెండేళ్ల కింద హైదరాబాద్, సిటీల్లో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లో సాయం కోసం ఎదురుచూసే బాధితుల గుర్తింపులో డ్రోన్లు కీలకంగా మారాయి.
పోలీసులు, DRF టీమ్‌లు వెళ్లలేని ప్రాంతాల్లోని గల్లీల్లోనూ, అపార్టుమెంట్లు, ఇండ్లలో ఉండిపోయిన బాధితులకు డ్రోన్ల ద్వారా ఫుడ్, వాటర్, మెడిసిన్ వంటివి సప్లై చేశారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా బాధితులకు సకాలంలో లైఫ్‌జాకెట్లు, తాళ్లను పంపించి ప్రాణాలను కాపాడారు. దీంతో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్లు ఎంత అత్యసవరమో ప్రభుత్వాలకు అర్థమైయిపోతుంది.
Read Also : Telangana CMRF : తెలంగాణలో వరద బాధితులకు ఈ క్యూఆర్ కోడ్‌తో విరాళాలు పంపొచ్చు..!