Telangana CMRF : తెలంగాణలో వరద బాధితులకు ఈ క్యూఆర్ కోడ్‌తో విరాళాలు పంపొచ్చు..!
Telangana CMRF : తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి విరాళాలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చెక్కులు, డీడీ రూపంలో లేదంటే యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి విరాళాలను పంపవచ్చు.
Telangana CMRF : వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని ఆయన కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి విరాళాలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చెక్కులు, డీడీ రూపంలో లేదంటే యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి విరాళాలను పంపవచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు అండగా నిలవాలనే స్ఫూర్తి పెంపొందించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇల్లు మునిగి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కనీస మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వాధికారులు శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా విరాళాలు పంపేవారి కోసం క్యూఆర్ కోడ్ కూడా రిలీజ్ చేసింది. విరాళాలను పంపే యూపీఐ మర్చెంట్ నేమ్.. తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్ పేరుతో ఉంటుందని పేర్కొంది. అలాగే యూపీఐ ఐడీ.. tgcmrelieffund@sbiగా తెలిపింది.
ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ : (RTGS/NEFT/IMPS)
అకౌంట్ నెంబర్ : 62354157651
అకౌంట్ నేమ్ : సీఎం రిలీఫ్ ఫండ్ (CM RELIEF FUND)
బ్యాంక్ నేమ్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)
బ్యాంక్ బ్రాంచ్.. సెక్రటేరియట్, హైదరాబాద్, తెలంగాణ
బ్రాంచ్ కోడ్ : 020077
IFS Code : SBIN0020077
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం… pic.twitter.com/dHIcMKTEWU
— Telangana CMO (@TelanganaCMO) September 4, 2024
చెక్ / డిమాండ్ డ్రాప్ట్ :
Payee Name : సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ రాష్ట్రం
అడ్రస్ : సీఎం రిలీఫ్ ఫండ్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్
హైదరాబాద్, 500022
ఆన్‌లైన్ పేమెంట్
(నెట్ బ్యాకింగ్/డెబిట్/ క్రెడిట్ కార్డు) ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు.
Read Also : రానున్న 24 గంటల్లో ఏపీకి మరో ముప్పు..! ఆ 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!