Hyderabad : మెట్రో నగరాల్లో పచ్చదనం పెంచటంలో హైదరాబాద్ టాప్

దేశంలోని మెట్రోనగరాల్లో   పెంచుతున్న పచ్చదనం విస్తీర్ణంలో గ్రేటర్ హైదరాబాద్ టాప్ లో   నిలిచింది. 2011-2021 వరకు గడిచిన దశాబ్దకాలంలో మెట్రో నగరాల్లో పెరిగిన పచ్చదనం విస్తీర్ణం పరిశీ

Hyderabad : మెట్రో నగరాల్లో పచ్చదనం పెంచటంలో హైదరాబాద్ టాప్

Forest Increase In Telangana

Updated On : January 14, 2022 / 11:08 AM IST

Hyderabad :  దేశంలోని మెట్రోనగరాల్లో   పెంచుతున్న పచ్చదనం విస్తీర్ణంలో గ్రేటర్ హైదరాబాద్ టాప్ లో   నిలిచింది. 2011-2021 వరకు గడిచిన దశాబ్దకాలంలో మెట్రో నగరాల్లో పెరిగిన పచ్చదనం విస్తీర్ణం పరిశీలించగా…జీహెచ్ఎంసీ పరిధిలో 48.66 చ.కిమీ లు ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో 19.91 చ.కిమీ  ఉంది.

పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ద్వైవార్షిక ప్రచురణ అయిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వెల్లడించిన నివేదికంలో తెలంగాణ అటవీ విస్తీర్ణం మెరుగుదలలో ముందుందని పేర్కోంది. ఇదే సమయంలో దేశంలోని అహ్మదాబాద్‌లో 8.55 చ.కి.మీ, బెంగళూరులో 4.98 చ.కి.మీ తగ్గింది.

634.18 చ.కిమీ పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో 2011 లో పచ్చదనం కేవలం 33.15 శాతం ఉండగదా అది 2021 కి 81.81 చ.కిమీలకు పెరిగింది.  హైదరాబాద్ నగరంలో పచ్చదనం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి చేపట్టిన హరిత హరం వంటి కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరుగుతూ వచ్చింది. హరితహారం కార్యక్రమం ద్వారా దాదాపు నాలుగు కోట్ల మొక్కలు ప్రభుత్వం ద్వారా నాటటం కానీ, పంపిణీ చేయటం కానీ జరిగింది.
Also Read : TTD : శ్రీవారి ఆలయంలో భక్తుల ఆందోళన, పెద్ద ఎత్తున నినాదాలు
2015 జులై లో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగ ర పెట్టుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు పంపిణీ చేపట్టింది. ఈ క్రమంలో 241.30 కోట్లు మొక్కలు నాటటంతో లక్ష్యాన్ని అధిగమించి రికార్డు నెలకొల్పినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఆర్ శోభ అన్నారు.